డ్రగ్స్‌ను నియంత్రించాలి
పెద్దపల్లి: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణకు చేపట్టిన చర్యలపై మంగళవారం తన చాంబర్‌లో పలువురు అధికారులతో సమీక్షించారు. మాదక ద్రవ్యాలకు అలవాపడితే ఆరో గ్యం దెబ్బ తింటుందని అన్నారు. ఆలోచనా విధానం నశిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వాటి నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఆపరేషన్ విజయవంతం
పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ అమరసింహారెడ్డి మంగళవారం ఓ మహిళకు అరుదైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారని డీసీహెచ్ శ్రీధర్ తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నెంపల్లి గ్రామానికి చెందిన మహిళ కడుపులో కుడివైపు నొప్పితో కొంతకాలంగా బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన డాక్టర్.. గ్లాడ్‌బ్లాడర్‌లో 14 ఎం. ఎం. మందంగల రాయిని గుర్తించారు. ఇప్పటి కే ఆమెకు నాలుగు ఆపరేషన్లు జరిగాయని, మరోఆపరేషన్ చేయడం క్లిష్టమైనా.. వైద్యులు సాయిప్రసాద్, విష్ణుచంద్రిక, స్వాతి, భవాని ఆధ్వర్యంలో ఆపరేషన్‌ను విజయవంతం చేశా రు. వారిని డాక్టర్ శ్రీధర్ అభినందించారు.
ఎఫ్‌ఎల్‌ఎస్‌పై దృష్టి పెట్టాలి
గోదావరిఖనిటౌన్: ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్)పై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్ సూచించారు. రామగుండం మండలంలోని జెడ్పీహైస్కూల్, గాంధీపార్క్, ఉ ర్దూ మీడియం పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌పై ప్రా థమిక పాఠశాలల ఉపాధ్యాయులకు రెండురోజులుగా సాగుతున్న జిల్లాస్థాయి సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం భవాని, ఆర్పీలు నీకత్ ఫాతిమ, అబ్దుల్ నిషాద్, అతిఫ, సీఆర్పీ వెంకటేశ్వర్లు, టీచర్లు ఉన్నారు.
రేపు ఎన్టీపీసీ డైరెక్టర్ల రాక
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని తెలంగాణ ప్రాజెక్టు సందర్శనకు ఈనెల 25న ఐదుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రానున్నా రు. ఇందులో అనిల్‌కుమార్ త్రిగునాయత్, అ నిల్ కుమార్ గుప్త, పంకజ్ గుప్త, గాయత్రిదేవి, సుశీల్ కుమార్‌చౌదరి ఉన్నారు. థర్మల్, సోలా ర్, ఫ్లోటింగ్ సోలార్, తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టుల్లో వారు పర్యటించనున్నారు. ఇటీవల ప ర్యావరణ అనుమతి పొందిన థర్మల్ ప్రాజెక్టు స్థలంతోపాటు పలు విభాగాలను పరిశీలించి అధికారులతో విద్యుత్ ఉత్పత్తి, ఉత్పాదకతపై సమీక్షిస్తారు. ఈమేరకు రామగుండంలోని ఎన్టీ పీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సేంద్రియ ఎరువుతో మేలు
పెద్దపల్లిరూరల్: భూసారం పెంపొందించేందు కు సేంద్రియ ఎరువుల వినియోగమే మేలని జి ల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ అన్నారు. బ్రా హ్మణపల్లి రైతువేదికలో మంగళవారం జాతీ య రైతుదినోత్సవం నిర్వహించారు. రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ వెంకటరమే శ్, శాస్త్రవేత్తలు వెంకన్న, భాస్కర్‌రావు, వినోద్‌కుమార్, కిరణ్, నవ్య, పూర్ణచందర్ నేల స్వ భావం కాపాడేందుకు పాటించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. ప్రతీఒక్కరు ఇంటి ఆవ రణలో పెరటి తోటలను పెంచుకోవాలని, త ద్వారా రసాయనాలను లేనికూరగాయలు ల భించి ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ మేకల రోజారాణి అన్నారు. ఏడీఏ శ్రీనాథ్, ఉపసర్పంచ్ జంగిలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌ను నియంత్రించాలి
డ్రగ్స్‌ను నియంత్రించాలి
డ్రగ్స్‌ను నియంత్రించాలి
డ్రగ్స్‌ను నియంత్రించాలి


