వేడుకలు.. నిరసనలు
సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒకవైపు వేడుకలు ఘనంగా నిర్వహించగా.. మరోవైపు వివిధ కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఉత్సవాల కోసం కేటాయించే నిధుల్లో కోత విధించడం, తూతూమంత్రంగా వేడుకలు నిర్వహించడంపై గుర్తింపు కార్మిక సంఘంతోపాటు ఇతర యూనియన్లు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో అగ్రగామిగా నిలవాలని ఆర్జీ–వన్ జీఎం లలిత్‌కుమార్ కోరారు. జీఎం కార్యాలయంలో జరిగిన సంస్థ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని ఆయన కార్మికు లకు సూచించారు. రాష్ట్రంలో సింగరేణి సంస్థ అగ్రగామిగా నిలవడం చాలా సంతోషంగా ఉందని సంతో షం వ్యక్తం చేశారు. నీటిశుద్ధి కోసం 17 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ త్వరలో పూర్తికానుందని తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలు, ఉత్త మ కార్మికులు, అధికారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆఈ కార్యక్రమంలో క్వాలిటీ రీజియన్ జీఎం సుజాయిముజందార్, అధికారుల సంఘం అధ్యక్షుడు బి.మల్లేశ్, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, ఏసీఎంవో అంబిక, ఏజీఎం రాంమోహన్‌రావు, ప్రాజెక్టు అధికారి రమేశ్, ఏజెంట్లు శ్రీనివాస్, రమేశ్, పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ నాయకుల నిరసన
సింగరేణి డేను తూతూమంత్రంగా నిర్వహించడాన్ని ఏఐటీయూసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆర్జీ–1 ఏరియాలోని అన్ని గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, రంగు శ్రీను, మాదన మహేశ్, సిద్దమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
యైటింక్లయిన్‌కాలనీలో..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ఆర్జీ–2 ఏరియాలో సింగరేణి ఆవిర్భావ వేడుకలను మొక్కుబడిగా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జిగురు రవీందర్, రాజారత్నం, అన్నారావు, శ్యాంసన్, సాంబశివరావు, బుర్ర తిరుపతి, మహేందర్, శ్రీనివాస్, శ్రీకాంత్, సత్యనారాయణగౌడ్, పుల్లయ్య, రాజేశ్, వెంకటేశ్, మనోహర్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకల బహిష్కరణ
రామగిరి(మంథని): ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్జీ–3, ఏపీఏ గనులపై సింగరేణి ఆవిర్భావ వేడుకలను బహిష్కరించారు. కార్యక్రమంలో ఆర్జీ–3 బ్రాంచ్ సెక్రటరీ ఎం.రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ జూపాక రామచందర్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బండారి క్రాంతి, నాయకులు డీటీ రావు, గంగాధర్, సురేశ్, పోశం, ఎన్.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కేక్‌కట్ చేస్తున్న జీఎం లలిత్‌కుమార్
వేడుకలు.. నిరసనలు


