బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నర్సింహారావు
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్పనేత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పీవీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రపంచదేశాలకు దీటుగా భారత్‌ను నిలిపారని ఆయన ప్రశంసించారు. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మక్కాన్‌సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని హంగులతో భవన నిర్మాణం
గోదావరిఖనిటౌన్: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్ర కారం అన్ని హంగులతో క్రిష్టియన్ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ హామీ ఇచ్చారు. మార్కండేయకాలనీ ఆర్‌కే గార్డెన్స్‌లో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఆయన మా ట్లాడారు. నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న 28 చర్చిలకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.30వేల చొప్పు న అందించనున్నారని రాజ్‌ఠాకూర్ తెలిపారు.


