సర్పంచ్ ప్రమాణస్వీకారం.. ఉపసర్పంచ్ రాజీనామా
పెద్దపల్లిరూరల్: నిట్టూరు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సం సోమవారం జరగగా.. ఉపసర్పంచ్ నీలం లక్ష్మణ్, తొమ్మిదో వా ర్డు సభ్యుడు పల్లెర్ల ఆంజనేయులు గైర్హాజరయ్యా రు. వారిద్దరు మినహా సర్పంచ్ ఆకుల సువర్ణ, వార్డుసభ్యుల చేత ప్రత్యేకాధికారి అలివేణి పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ సువర్ణకు బాధ్యతలు అప్పగించారు. ఇటు సర్పంచ్‌గా ఆకుల సువర్ణ పదవీ బాధ్యతలను స్వీకరిస్తుండగానే.. అటు ఉపసర్పంచ్ నీలం లక్ష్మణ్ తన పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాసిన రాజీనామా లేఖను అందించారని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.
వార్డు సభ్యుడి గైర్హాజర్ ఎందుకో?
నిట్టూరులోని 9వ వార్డు సభ్యుడు పల్లెర్ల ఆంజనేయులు కూడా రాజీనామా చేయనున్నారా? అందు కే గైర్హాజరయ్యారా? అనే చర్చ సాగుతోంది. సర్పంచ్ పదవి చేజారడంతో ఉపసర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్న ప్రత్యర్థుల ఎ త్తులు చిత్తవడంతోనే పాలకమండలిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. నిట్టూరులో మొదలైన రాజకీయ ఎత్తులో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాల్సిందే.
ప్రశాంతంగా బాధ్యతలు స్వీకరణ
పెద్దపల్లి: జిల్లాలోని 262 గ్రామ పంచాయతీల పా లవర్గాలు సోమవారం కొలువు దీరాయి. సర్పంచు లు, ఉప సర్పంచులతోపాటు వార్డుసభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారని డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. పలువురు అధికారులు పాలకవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించారని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం నిట్టూరు ఉపసర్పంచ్ పదవికి సతీశ్ రాజీనామా చేసి, మండల అధికారులకు లేఖ ఇచ్చారని, అయినా రాజీనామాకు ఆమోదం తెలుపలేదని ఆయన వివరించారు. అధికార పార్టీ ఒక నాయకుడు ప్రాబల్యంతోనే రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నాయకులు కలగజేసుకొని రాజీనామాను ఉపసంహరించుకునేలా చేయాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు.


