అర్జీలను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

Dec 23 2025 6:48 AM | Updated on Dec 23 2025 6:48 AM

అర్జీ

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

పెద్దపల్లి: ప్రజావాణి ద్వారా అర్జీల రూపంలో అందిన సమస్యలను సత్వరమే పరిష్కరించా లని అదనపు కలెక్టర్‌ వేణు ఆదేశించారు. కలెక్టర్‌లో సోమవారం ప్రజావాణి ద్వారా ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పె ద్దపల్లికి చెందిన మౌనిక.. వారధి ద్వారా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న స్టోర్‌ కీపర్‌ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లికి చెందిన బండి దేవమ్మ.. తనకు గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని, పాలకుర్తి మండ లం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుంపుల సతీశ్‌.. తాను దివ్యాంగుడనని, మూడు చక్రాల వాహనం అందించాలని, పెద్దపల్లికి చెందిన డి.స్వప్న డబుల్‌బెడ్రూమ్‌ ఇంటికోసం దర ఖాస్తు చేశారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని ఆయన అన్నారు.

బాధ్యతలు స్వీకరణ

పెద్దపల్లి: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రత్యేక అధికారులు సోమవారం బాధ్యతలు స్వీకరించారని డీసీవో శ్రీమాల తెలిపారు. ఈనెల 20న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఇన్‌చార్జిల బాధ్యతలను రద్దు చేయడంతోపాటు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాగా, సహకార సంఘాల ప్రక్షాళనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.

విద్యార్థులకు కంటిపరీక్షలు

సుల్తానాబాద్‌రూరల్‌: విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయాలని జిల్లా వైద్యాధికారి ప్రమోదుకుమార్‌ సూచించారు. గర్రెపల్లి మోడల్‌ స్కూల్‌లో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. డీఎంహెచ్‌వో పరీక్షల తీరు పరిశీలించి మాట్లాడారు. కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి సమస్య పరిష్కరించాలన్నారు. ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, నిపుణు లు అజయ్‌కుమార్‌, రమాదేవి పాల్గొన్నారు.

నియామకం

రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ స మ్మక్క – సారలమ్మ జాత ర కమిటీ చైర్మన్‌గా గీట్ల శంకర్‌రెడ్డిని నియమించా రు. రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌ ఆదేశాల మేరకు ఆయన నియామకం చేపట్టారు. ఆయనను పలువురు అభినందించారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,414

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,414 ధర పలికింది. కనిష్టంగా రూ.6,161, సగటు ధర రూ.7,112గా నమోదైందని మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి ప్ర వీణ్‌రెడ్డి తెలిపారు. మొత్తం 922 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

కబడ్డీ పోటీలకు ఎంపిక

ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి హైస్కూల్‌లోని పదో తరగతి విద్యార్థిని శ్రీవల్లి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. పెద్దపల్లిలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఆమె ప్రతిభ చూపింది. ఆమెను ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య, డీటీఎఫ్‌ నేత అమృత కిశోర్‌, పీఈటీ హరికృష్ణ, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.

కూల్చిన స్థలంలోనే నిర్మించాలి

గోదావరిఖని: కూల్చివేసిన స్థలంలోనే మళ్లీ షా పు నిర్మించి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో సోమవారం ఆయన ధర్నా చేశారు. కూల్చి వేసిన షాప్‌ వద్ద నిరసన చేపట్టిన ఆ కుల మల్లేశ్‌ దంపతులను ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. రెండేళ్లుగా కూల్చివేతల ప ర్వం సాగుతోందన్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠూకర్‌ కారణంగా రోడ్డున పడ్డ లలిత కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. కా ర్యక్రమంలో కౌశిక హరి, గోపు అయులయ్య యాదవ్‌, కౌశిక లత, పాముకుంట్ల భాస్కర్‌, కుమ్మరి శ్రీనివాస్‌, కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవితసరోజిని, బాదే అంజలి, బొడ్డుపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి 1
1/3

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి 2
2/3

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి 3
3/3

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement