చర్చిల మరమ్మతుకు నిధులు
పెద్దపల్లి: క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని చర్చిల మరమ్మతు, క్రైస్తవులకు విందు ఏర్పాటు చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఈనెల 25న జరగనున్న క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలోని రెండు ప్రధాన పట్టణాల్లో విందులు ఏర్పాటు చేయనున్నారు. పెద్దపల్లి, రామ గుండం, మంథని నియోజకవర్గానికి 50 చర్చిలకు నిధులను మంజూరు చేసింది.
నిధుల కేటాయింపు
జిల్లాలోని చర్చిల మరమ్మతుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా.. ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున కేటాయించింది. భవనాలకు రంగులు వేయడం(పెయింటింగ్), డిజిటల్ లైటింగ్ ఏర్పాటు, అలంకరణ తదితర పనులు చేపడతారు. గత ప్రభుత్వం క్రైస్తవులకు పండుగ సందర్భంగా కొత్త దుస్తులు అందించగా.. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూ రు చేయడం గమనార్హం.
విందుకు రూ.6 లక్షలు
జిల్లావ్యాప్తంగా ఎంపికచేసిన పట్టణాల్లో క్రైస్తవులకు విందు ఏర్పాటు చేసేందుకు రూ.6 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గంలోని ప్రధాన పట్టణాల్లో ఈ నిధులు వెచ్చించి విందులు ఏర్పాటు చేస్తారు.
ఇవీ నిబంధనలు..
నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తోంది. కచ్చితంగా చర్చి సొసైటీ రిజిస్ట్రే షన్ ఉండాలి. బైలా, ప్రెసిడెంట్, సెక్రటరీలేదా కో శాధికారికి జాయింట్ అకౌంట్ సొసైటీ పేరున ఉండాలి. నిధుల కోసం పెద్దపల్లి నుంచి 30, మంథని నుంచి 14, రామగుండం నుంచి 18 దరఖాస్తులు వచ్చినట్లు మైనార్టీ కార్పొరేషన్ జిల్లా ఇన్‌చార్జి అధికారి నరేశ్‌కుమార్ నాయుడు తెలిపారు.


