కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్
పెద్దపల్లి: విద్యార్థులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళా శాల విద్యార్థుల కోసం తనసొంత నిధులు వెచ్చించి 45 రోజులపాటు మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు లక్ష్య సాధనతోపాటు తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేయాలని ఎమ్మె ల్యే విదార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్, ప్రిన్సిపాల్ రామచంద్రరెడ్డి, హెచ్‌ఎం రత్నాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, వా లీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, నాయకులు గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, గణేశ్, లెక్చరర్లు దేవేందర్, ప్రభాకర్, హరికృష్ణ, సునీల్, మాధవిలత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి అభివృద్ధికి నిరంతర కృషి
జిల్లా కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రంగంపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆ యన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పట్టణాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, అధికారులు, సిబ్బంది, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మేడిపల్లి ఓబీ డంప్‌యార్డుపై పులి
గోదావరిఖని: మూసివేసిన సింగరేణి మేడిపల్లి ఓసీపీ ఓబీ డంప్‌యార్డుపైనే పులి మకాం వేసింది. నాలుగురోజులుగా మేడిపల్లి ఓసీపీని కేంద్రంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లో తిరుగుతోంది. ఓబీ డంప్‌యార్డుపై చెట్లపొదలు పెద్దఎత్తున ఉన్నాయి. ఇది పులి ఆవాసానికి అనువుగా ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే వన్యప్రాణులు కూడా ఉండడంతో పులికూడా అదే ప్రాంతంలో నివాసంగా మార్చుకున్నట్లు చెబుతున్నారు. వేటకోసం చుట్టు పక్కల ఉన్న పంటపొలాలు, ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో సోమవారం ప్రాసెస్ ఓబీ, టెంపుల్ ఏరియా ప్రాంతంలో పులిఅడుగు జాడలు కనిపించినట్లు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు, వైల్డ్‌లైఫ్ సిబ్బంది, సింగరేణి అధికారులు కలిసి చాలాసేపు ఆప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఫారెస్ట్ అధికారి రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.
కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్


