మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
పెద్దపల్లి: మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. మాజీకేంద్రమంతి జి.వెంకటస్వామి(కాకా) వర్ధంతి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాలవేసి నివాళ ఇర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అట్టడుగువర్గాల సంక్షేమం, అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, జిల్లా క్రీడల అధికారి సురేశ్, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
కమిషనరేట్‌లో కాకా వర్ధంతి
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో వెంకటస్వామి(కాకా) వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అదనపు డీసీపీ శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, పీసీఆర్ సీఐ రవీందర్, ఆర్‌ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం పాల్గొన్నారు.
కార్మిక పక్షపాతి ‘కాకా’..
గోదావరిఖని : సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పింఛ న్ ఇప్పించి కార్మిక పక్షపాతిగా వెంకటస్వామి(కా కా) నిలిచాడని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక జీఎం ఆఫీస్ సమీపంలోని కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వివిధ ప్రాంతాల్లో వర్ధంతి నిర్వహించారు. నాయకులు బొంతల రాజేశ్, పి.మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, పెంచాల తిరుపతి, రాజేందర్, సారయ్య, కామ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి


