పల్లెకు పాలకవర్గం
ప్రమాణస్వీకారం చేసిన పాలకవర్గాలు
బాధ్యతలు స్వీకరించిన ఉపసర్పంచులు
వారివెంటే వార్డుసభ్యులు కూడా..
తొలిరోజు పలు అంశాలపై తీర్మానాలు
బడ్జెట్, పారిశుధ్యం, రోడ్లపై చర్చ
ముగిసిన ప్రత్యేకాధికారుల పాలన
సాక్షి పెద్దపల్లి: జిల్లాలోని కొత్త పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారుల నుంచి సర్పంచు లు బాధ్యతలు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 263 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా.. ఒకపంచాయతీ కేసు కోర్టుకు చేరింది. మిగిలిన 262 పంచాయతీల్లో ఎన్నికై న కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం చేశారు. సుమారు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీ కారం చేపట్టిన వెంటనే కొందరు సర్పంచులు గ్రా మంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టా రు. పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఎల్లవేళాల అందుబాటులో ఉంటామన్నారు. ప్రజాసేవకే అంకితమవుతాని చెప్పారు. ఎన్నిక సందర్భంగా ఇ చ్చిన హామీలను నెరవేరుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ప్రమాణ స్వీకారం ఇలా..
జిల్లాలోని గత పంచాయతీ పాలకవర్గాల పదవీకా లం 2024 ఫిబ్రవరి ఒకటో తేదీన ముగిసింది. దీంతో ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారులను ఇన్‌చార్జిలుగా నియామించింది. దాదాపు 20 నెలల పాటు పల్లెపాలన కొనసాగించింది. అయితే, తమ శాఖలోని సమస్యలతో సతమతమయ్యే ప్రత్యే కాధికారులు.. పల్లెల్లోని సమస్యలను పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయా యి. తాజాగా ఎన్నికలు నిర్వహించడంతో.. గెలుపొందిన పాలకవర్గాల వివరాలతో కూడిన ఫారం–15ను రిటర్నింగ్ అధికారి నుంచి అందుకుని పంచాయతీ కార్యదర్శలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు స భ్యులతో ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రమాణప్రతంపై కొత్త సర్పంచులు సంతకం చేశారు.
తొలిసమావేశంలో పలు తీర్మాణాలు
పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో సర్పంచులు, పాలక వర్గాలు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. పాలకవర్గాల సమక్షంలో పలు వివిధ తీర్మానాలు చేశాయి. ప్రధానంగా ఎన్నికై న 15రోజుల్లోగా తొలిగ్రామసభ నిర్వహించాలని నిర్ణయించాయి. చాలా పంచాయతీల్లో గ్రామసభ నిర్వహణ, బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, వీధిదీపాలు, పారిశుధ్యం పర్యేవేక్షణ, సీసీ రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై తొలిరోజు చర్చ కొనసాగించాయి.
పార్టీలకతీతంగా అభివృద్ధి
ధర్మారం(ధర్మపురి): కొత్త సర్పంచులు పార్టీలకతీతంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరా రు. కొత్తూరు సర్పంచ్ భూక్య సంగీత, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయగా.. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతీగ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోందన్నారు. వ్యక్తిగత విభేదాలు, రాజకీయ ద్వేషాలు పక్కనపెట్టి పల్లెప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో 149 గ్రామాలు ఉంటే.. 108 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులు విజ యం సాధించడం ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, మాజీ సర్పంచ్ మల్లేశం, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఐలు వరలక్ష్మి, నవీన్‌రావు, ఎంపీవో రమేశ్, ఏపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


