కిరాణా దుకాణానికి వెళ్లాలంటేనే భయపడుతున్నాం. చిల్లరగా కిలో సన్నబియ్యం కొనాలంటే రూ.65 పైనే చెల్లించాల్సి వస్తోంది. బ్రాండ్ల పేరుతో, 26 కిలోల ప్యాకింగ్ నెపంతో ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. కూలి నాలి చేసుకునే మాలాంటోళ్ల బతుకు మరింత భారంగా మారింది. రెక్కల కష్టం బియ్యం కొనుగోలుకే సరిపోతోంది. మార్కెట్లో అధికారుల పర్యవేక్షణ, ధరల నియంత్రణ ఏమాత్రం కనిపించడం లేదు. సామాన్యుల కష్టాలను గుర్తించి ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి.
–ఎమ్.కుసుమ,
గృహిణి, పార్వతీపురం
●


