–10లో
● నేటి నుంచి రిలే దీక్షలు
పార్వతీపురం రూరల్ : డీఎస్సీ అర్హులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. నిరుద్యోగులకు అండగా నిలుస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నుంచి ఆదివారం వరకు (ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు) నాలుగు రోజుల పాటు స్థానిక వైఎస్సార్ విగ్ర హం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. పార్వతీపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతాయి. తొలి రోజైన గురువారం ఉద యం బలిజిపేట మండల యువత, మధ్యాహ్నం పార్వతీపురం పురపాలక సంఘం యువత ఈ శిబిరం దీక్షలో కూర్చుంటారు. యువత, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మె ల్యే అలజంగి జోగారావు ఒక బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.


