8న ఏజెన్సీ బంద్‌ | - | Sakshi
Sakshi News home page

8న ఏజెన్సీ బంద్‌

Aug 6 2026 12:51 AM | Updated on Aug 6 2026 12:51 AM

8న ఏజెన్సీ బంద్‌

పార్వతీపురం రూరల్‌ /సీతంపేట: గిరిజనుల ఉపాధికి జీవనాధారమైన జీఓ నంబరు–3కి ప్రత్యామ్నా య చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, ఏజెన్సీ భూములను రక్షించే 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8న రాష్ట్ర వ్యా ప్త ఏజెన్సీ బంద్‌కు పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో బుధవారం వివిధ గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సీతంపేటలో వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. సుప్రీంకోర్టు రద్దు చేసిన జీఓ–3 లక్ష్యాలకు అనుగుణంగా, నేతల ఎన్నికల హామీ మేరకు ప్రత్యామ్నాయంగా శ్యామ్‌నాయక్‌ చట్టాన్ని తేవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేలా కోర్టు కేసుల పేరుతో 1/70 చట్టాన్ని నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ గిరిజన యువత ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని, ఈ చట్టాలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. గిరిజన హక్కుల సాధన కోసం ఈ నెల 8న నిర్వహించే ఏజెన్సీ బంద్‌కు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపి జయప్రదం చేయా లని విజ్ఞప్తి చేశారు. వివిధ సంఘాల నేతలు కె.రామస్వామి, పి.రంజిత్‌ కుమార్‌, బి.వి.రమణ, సీతారాం, రెడ్డి ఈశ్వరరావు, గంగునాయుడు, దాసు, వేణు, ఇందిర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement