పాలకొండ:
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై యువత, విద్యార్థులు ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కల్యాణ ఏఎంజీ ఫంక్షన్ హల్‌లో నియోజకవర్గానికి ని సంబంధించి టౌన్ హల్ సమావేశం బుధ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్నికల ముందు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు రెండేళ్ల తరువా త డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థులను దగా చేశారని ఆరోపించారు. లోకేష్ యువగళం సభ్యుల కు ఉద్యోగాలు ఇవ్వడానికి కొత్త జీఓ తెచ్చి అక్రమాలకు పాల్పడి స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు కట్ట బెట్టారని తెలిపారు. అర్హులైన వారికి, మెరిట్ మా ర్కులు వచ్చిన వారికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ లిస్టు అభ్యర్థుల డేటాను మాయం చేశారని తెలిపారు. మొదటి ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు రాలేదో ప్రభు త్వం చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు. స్పోర్ట్ కోటాను 3 శాతంకు పెంచి 29 క్రీడలను 65కు పెంచారని వివరించారు. వారి నుంచి రూ. 15 లక్షలు చొప్పున తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై అభ్యర్థులు ఆధారాలతో కోర్టుకు వెళ్లారని, హైకోర్టు కూడా విచారణ జరపా లని ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఉన్న డిమాండ్లుపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ స్కామ్‌కు బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు నిరుద్యోగులు, యువత తరఫున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు యువతకు అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని కోరారు. సమావేశంలో నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్త లు, పలు వర్గాల ప్రజలు పాల్గొన్నారు.


