నలుదిక్కులా.. నిరసన సెగ! | - | Sakshi
Sakshi News home page

నలుదిక్కులా.. నిరసన సెగ!

Aug 6 2026 12:51 AM | Updated on Aug 6 2026 12:51 AM

–10లో నలుదిక్కులా.. నిరసన సెగ! ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించాలి గృహనిర్మాణ శాఖ ఏఈపై విచారణ 10న సాలూరు ఐటీఐలో నేషనల్‌ అప్రెంటిస్‌ మేళా ● లోకేష్‌ రాజీనామా చేయాలి ● సీబీఐతో విచారణ జరిపించాలి ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌

మెగా డీఎస్సీ అక్రమాలపై

సీబీఐతో విచారణ జరిపించాలి

జీఓ 3 తేకపోతే ఏజెన్సీని

స్తంభింపజేస్తాం..

న్యూస్‌రీల్‌

కూటమి కోటపై ప్రజాగ్రహం

ఆచరణలో చతికిలబడ్డ హామీలు

రోడ్డెక్కుతున్న ప్రజా సంఘాలు

మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై అగ్గిమీద గుగ్గిలం

సీబీఐ విచారణకు పట్టు

జీఓ–3కి ప్రత్యామ్నాయం కోరుతూ 8న ఏజెన్సీ బంద్‌కు పిలుపు

రూ.7 వేల కోట్ల ఫీజు బకాయిలు

–10లో

గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026

పార్వతీపురం: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికా రులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభా కరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సన్నాహకాలపై బుధవారం నిర్వహించిన జూమ్‌ సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాల నుంచి ఉత్తమ సాంస్కృతిక బృందాలను ఎంపిక చేసి విద్యార్థులకు వెంటనే శిక్షణ ప్రారంభించాలని సూచించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక చైతన్యం ప్రతిబింబించే సాంస్కృతి క, క్రీడా ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ కె.హేమలత తో పాటు వివిధ శాఖల అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు.

పాలకొండ: పాలకొండ గృహ నిర్మాణ శాఖ ఏఈ సుధారాణిపై ఆ శాఖ ఈఈ సోమేశ్వరరా వు బుధవారం విచారణ చేపట్టారు. పట్టణంలో ని బాసూరు వీధి సచివాలయంలో వార్డు ఇంజనీర్లును విచారించి వారి నుంచి రాతపూర్వక ఫిర్యాదులు తీసుకున్నారు. ఇటీవల వార్డు ఇంజినీర్లు తమ లాగిన్‌ నుంచి సిమెంట్‌ బస్తాలు తమకు తెలియకుండా ఏఈ పక్కదారి పట్టించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టామని ఈఈ తెలిపారు. ఇప్పటికే లబ్ధిదా రులను విచారించామని, ప్రస్తుతం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లను విచారిస్తున్నామని ఆయన తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.

సాలూరు: పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల లో ఈ నెల 10న ప్రధానమంత్రి నేషనల్‌ అప్రెంటిస్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ డి.శ్రీనివాసాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో రెయిన్‌ గ్రూప్‌ ఆటోమోటివ్‌ లిమిటెడ్‌, అర్న ఎనర్జిస్‌, ఎలక్ట్రో స్టీల్‌ కేస్టింగ్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్‌ ప్రతినిధు లు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు స్టైఫండ్‌ అందజేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, మొబైల్‌ నెంబర్‌, ఈ మెయిల్‌ తదితర వివరాలతో పాటు ఒరిజినల్‌, జెరాక్స్‌ పత్రాలు తీసుకుని మేళాకు హాజరు కావాలన్నా రు. అప్రెంటిస్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేని వారు కూడా ఈ మేళాకు నేరుగా హాజరుకావచ్చని తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అప్రెంటిస్‌ తరువాత సంబంధిత అభ్యర్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అప్రంటిస్‌ అడ్వయిజర్‌ శ్రీనివాసరావు 9573644439 నంబరును సంప్రదించాలని సూచించారు.

పార్వతీపురం రూరల్‌ :

న్నికల వేళ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు ఆచరణలో అడుగున పడిపోవడంతో.. దాదాపు రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి జ్వాలలు రగులుకుంటు న్నాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు, ఏజెన్సీ హ క్కుల ఉల్లంఘన, ఫీజు బకాయిల నుంచి ఇంధన ధరల పెంపు వరకు వివిధ సమస్యలపై ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ ఫెడరేషన్లు, కార్మికులు ఇప్పటికే కలెక్టరేట్ల ఎదుట ఆందోళన బాట పట్టారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఈ నిరసన గళానికి శ్రుతి కలుపుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ధర్నాలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి.

డీఎస్సీ అక్రమాలపై భగ్గు

గద్దెనెక్కే ముందు ఇచ్చిన ప్రధాన హామీలు, పథకా లు నీటి మూటలుగా మిగిలిపోయాయన్న విమర్శ లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. అర్హులకు అన్యాయం జరిగిందని, ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబడు తూ డిమాండ్‌ చేస్తున్నారు.

చట్టాల రక్షణకై గిరిజనుల గర్జన

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల ఉపాధికి జీవాధార మైన జీఓ నంబర్‌–3 రద్దుతో తలెత్తిన పరిస్థితు లపై ఆదివాసీ సంఘాలు రగిలిపోతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, గిరిజన భూములకు రక్షణ కవచమైన 1/70 చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 8న రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్‌కు పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. గిరిజనుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి.

ఉపాధ్యాయులపై ఉక్కుపాదం..

కార్మికుల కన్నీరు

విద్యాశాఖలోనూ తీవ్ర అశాంతి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ ఫెడరేషన్లు ఆందోళనలకు దిగుతున్నాయి. మరోవైపు ఏకంగా రూ.7,000 కోట్ల మేర ఫీజు బకాయి లు పేరుకుపోవడం, మారుమూల ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కరవవడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు స్మార్ట్‌ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించే దిశగా సర్కారు అడుగులు వేస్తుండటంతో.. ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికులు తమ ఉపాధికి గండి కొడుతున్నారంటూ ఆందోళనలు ఉద్ధృతం చేశారు.

కూడగడుతున్న వ్యతిరేకత

సామాన్యుడి నడ్డివిరిచేలా ఉన్న ఇంధన ధరల పెంపు, ప్రభుత్వ ఏకపక్ష జీఓలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ.. వైఎస్సార్‌సీపీ సహా వామపక్ష, ఇతర ప్రజా సంఘాలు నిత్యం కలెక్టరేట్లు, తహసీల్దార్‌ కార్యాలయాల ముందు ధర్నాలకు దిగుతున్నాయి.

హామీలు నమ్మి ఓటేసిన నిరుద్యోగులను, యువతను ఈ కూటమి ప్రభుత్వం నిలువునా వంచించింది. మెగా డీఎస్సీ–2025 పేరుతో తీవ్రమైన అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థులకు మొండిచేయి చూపారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించి నిజాయితీపరులకు న్యాయం చేయాలి. మరోవైపు రూ.7,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది పేద విద్యార్థుల చదువులు వీధి పాలు అయ్యే పరిస్థితి వచ్చింది. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను స్వస్తి పలికే వరకు మా పోరాటం ఆగదు.

– అనంత నాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు

గిరిజనుల విద్యా, ఉపాధి హక్కులకు జీవనా ధారమైన జీఓ నంబరు–3 రద్దయ్యాక ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం వెంటనే దానికి ప్రత్యామ్నా య చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఆదివా సీల భూములను కాపాడే 1/70 చట్టాన్ని పక డ్బందీగా అమలు చేయాలి. గిరిజనుల హక్కు లను కాలరాస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్‌ను జయప్రదం చేయాలి.

– కె.రామస్వామి, గిరిజన కార్మిక సంఘం నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement