నెలవారీ వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం వరకు రూ.1,300 ఉన్న 26 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు ఏకంగా రూ.1,700 దాటిపోయింది. సన్నబియ్యం కొందామంటేనే భయమేస్తోంది. బియ్యం ధరలకు తోడు అన్ని సరుకుల ధరలూ పెరిగిపోవడంతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. నూకల ధరలు కూడా మండిపోతుండటంతో సామాన్యులు బతకడం కష్టంగా మారింది. అక్రమ నిల్వలపై తనిఖీలు చేసి, ప్రభుత్వం వెంటనే ధరలను నియంత్రించాలి.
– అంబటి సురేష్,
ప్రైవేటు ఉద్యోగి, నర్సిపురం
●


