టీచర్లకు టెట్‌ కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు టెట్‌ కష్టాలు!

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

నేటి నుంచి టెట్‌

రామభద్రపురం:

విద్యార్హత, వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ఉత్తీర్ణత నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులతో పాటు టీచర్లకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా.. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్‌ పరీక్ష తప్పకుండా రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక అయ్యవార్లు తలలు పట్టుకుంటున్నారు. ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్‌ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించడంతో 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్‌ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా, టీచర్లకు టెట్‌ కష్టాలు తెచ్చిపెట్టిందని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

టీచర్లకు టెట్‌ కష్టాలు

నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులతో సమానంగా టీచర్లు కూడా 150 మార్కులకే టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పదిహేను, ఇరవై ఏళ్లుగా ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు మళ్లీ టెట్‌ అర్హత పరీక్షలు రాయాల్సి రావడం సవాల్‌గా మారింది. ఎస్టీటీలు ఇంగ్లిష్‌, తెలుగు, గణితం, సైన్స్‌, సోషల్‌, సైకాలజీ సిలబస్‌లలో 150 మార్కులు రాయాల్సి ఉండగా స్కూల్‌ అసిస్టెంట్లు ఇంగ్లిష్‌, తెలుగు టీచర్లు ఇంగ్లిష్‌తో పాటు తెలుగు సిలబస్‌ ఉంటుంది. సైన్స్‌, గణితం, సోషల్‌ టీచర్లు తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, ఫిజిక్స్‌, బయాలజికల్‌ సైన్స్‌, సోషల్‌ సిలబస్‌ను రాయాలి. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్లు అందరూ సైకాలజీ సిలబస్‌ కూడా రాయాల్సి ఉంది. కొత్త సిలబస్‌, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు రాయాల్సి ఉండడంతో అయ్యవార్లలో ఆందోళన కలిగిస్తోంది.

3 కేంద్రాలు.. 12,358 అభ్యర్థులు

నిమిషం ఆలస్యమైన అనుమతి

నిరాకరణ

నేటి నుంచి 16వ తేదీ వరకు

టెట్‌

ఆందోళనలో అయ్యవార్లు

తలలు పట్టుకుంటున్న

ఉపాధ్యాయులు

టెట్‌ కష్టాలు తప్పలేదని ఆవేదన

విజయనగరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే పరీక్షకు 12,358 మంది హాజరు కానున్నట్టు వెల్లడించారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించటంతో అభ్యర్థులు నిర్ణీత సమయానికి అరగంట ముందుగా పరీక్ష కేంద్రంకు హాజరు కావాలని సూచించారు. డెంకాడ మండలం చింతలవలసలో డాక్టర్‌ ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, గాజులరేగ వద్దనున్న సత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, అయాన్‌ డిజిటల్‌ జోన్‌లో జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రతి రోజు మూడు కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష హాల్‌లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించమని, అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో పాటు ఆధార్‌/పాన్‌/ ఓటరు కార్డును వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షకు సంబంధించి ఎటువంటి సందేహాలు, సమస్యలు నివృత్తి చేసుకునేందుకు 95503 94572, 96180 42932, 99895 68641 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement