డీఎస్సీ అమలు నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధన తెరపైకి తీసుకురావడం సరైంది కాదు. దీని వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 2011కు ముందు టెట్ అమలులో లేదు. ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే బాగుండేది. ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. – జేసీ రాజు,
ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్, బొబ్బిలి


