మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ విద్యార్థుల ప్రతిభ

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ విద్యార్థుల ప్రతిభ ● పోటీల్లో సుస్థిర వ్యవసాయ ప్రాజెక్టు.. జి. అజిత్‌రాయ్‌ (విశాఖపట్నం), ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయ వాడకం.. కె పవన్‌సాయిరాజ్‌ (పల్నాడు జిల్లా మద్దిరాల పీఎంశ్రీ), హరితశక్తి ప్రాజెక్టు..ఎ. హరిప్రియ(శ్రీకాకుళం) జేఎన్‌వీలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో బహుమతులు సాధించాయి. ● ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో ముఖ్య అతిథులు చిలకలూరిపేట యూబీఐ మేనేజర్‌ రోహిత్‌సిన్హా, మద్దిరాల సాదినేని చౌదరయ్య డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ శివప్రసాద్‌, ధనలక్ష్మి గ్రూప్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ లింగయ్యచౌదరి, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి. శ్రీనివాసరావు పాల్గొన్ని ప్రసంగించారు. ● విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ఇలాంటి ప్రదర్శనల ద్వారా పరిశోధనాత్మక నైపుణ్యాలను పెంచుకోవాలని ఆకాంక్షించారు. విద్యాలయం సైన్స్‌ ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో ఈ ప్రదర్శనను విజయవంతం చేశారు.

క్లస్టర్‌ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన సైన్స్‌లో సృజనాత్మకతను చాటిన 9 జేఎన్‌వీల విద్యార్థులు మొదటి , రెండు స్థానాల్లో విశాఖపట్నం, పల్నాడు జిల్లాలు

యడ్లపాడు: మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయంలో రెండురోజుల వైజ్ఞానిక ప్రదర్శన శనివారం ముగిసింది. జేఎన్‌ఎస్‌ హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని 9 జవహర్‌ నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు 60 రకాల ప్రాజెక్టులతో హాజరై ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో విద్యాలయ ప్రిన్సిపాల్‌ నల్లూరి నరసింహారావు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో బాల శాస్త్రవేత్తలు రూపొందించిన అంశాలు అందర్నీ ఆకట్టుకుని ఆలోచింపజేశాయి. ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తీవ్ర పోటీ నడుమ సాగిన ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యాలయాల వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement