న్యూస్‌రీల్
నేటి నుంచి నిరసన
సాగర్ నీటిమట్టం
పల్నాడు
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ సేవ కేంద్రాలు పేరుతో పూర్తిగా వారే సేవలు చేసే ఈ ప్రక్రియ ప్రమాదకరమని, ప్రజల ఆస్తులకు ముప్పు తప్పదని పలువురు ఆందోళన చెందుతున్నారు. దస్తావేజు లేఖరుల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటున్నారు.
డాక్యుమెంట్ల తయారీలో లేఖరులదే కీలక పాత్ర. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే భూమి, ఇళ్లు, వివాహ ధ్రువీకరణ, మార్టిగేజ్ తదితర పత్రాల తయారీలో ఎంతో శ్రమించి పూర్తిస్థాయి సమాచారంతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించడంతోపాటు సజావుగా ప్రక్రియ జరిగేలా చూస్తారు. లబ్ధిదారులకు, రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి వారధిగా పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవంతో పనిచేస్తున్న వీరి పనిని ఇలా పూర్తిస్థాయిలో ప్రైవేటు వారికి అప్పగిస్తే పారదర్శకత లోపించే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.
దస్తావేజు రాయడమంటే .. కేవలం కంప్యూటర్లో డేటా నమోదు చేయడమే కాదని పలువురు చెబుతున్నారు. స్థానిక చరిత్ర, పాతలింకు దస్తావేజులు, సరిహద్దులు, హక్కుల వివరాలపై అవగాహన ఉన్న దస్తావేజు లేఖరులు ఇప్పటివరకూ వివాదాలకు అవకాశం లేకుండా డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే భవిష్యత్తులో ప్రజా ఆస్తులకు రక్షణ ఉండదని, ఈ విషయంలో వివాదాలు పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్టాంపు పేపర్ల స్థానంలో తెల్ల కాగితంపైనే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ. 2 వేలు వసూలు చేయాలని యోచిస్తోందన్నారు.
ఆర్‌ఎస్‌కేల ఏర్పాటుపై
చంద్రబాబు ప్రభుత్వం దృష్టి
ప్రశ్నార్థకంగా దస్తావేజు
లేఖరుల జీవనోపాధి
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి
సర్కారు పనులు
ప్రజా ఆస్తుల పరిరక్షణపైనా ఆందోళన
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా
లేఖరుల పెన్ డౌన్
ప్రభుత్వ యోచనను వ్యతిరేకిస్తూ జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, క్రోసూరు, అమరావతి, పిడుగురాళ్ల, గురజాల, మాచర్లలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని దస్తావేజు లేఖరులు ఈ నెలలో రెండు రోజులపాటు పెన్‌డౌన్ చేపట్టారు. ఆ రెండు రోజుల్లో ప్రభుత్వానికి రూ. 4 కోట్లకుపైగా ఆదాయం గండి పడిందని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రైవేటీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, కొన్ని దశాబ్దాలుగా దీనిపై ఆధారపడిన దస్తావేజు లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు తదితర లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్ కార్యక్రమానికి దస్తావేజు లేఖరులు పిలుపునిచ్చారు. జీవో నంబర్ 396 కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌కేల ఏర్పాటు మానుకోవాలని, దస్తావేజు లేఖరులు నిరవధికంగా పెన్‌డౌన్ నిర్వహించనున్నారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.40 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేట్‌పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అలంకారప్రాయంగా మారనున్నాయి. చంద్రబాబు సర్కారు పీపీపీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. రిజిస్ట్రేషన్ సేవ కేంద్రాలు (ఆర్‌ఎస్‌కేలు) ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తులకు పనులను కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో ప్రజలకు వేగంగా సేవలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో వేల మందికి ఉపాధి పోతుందని దస్తావేజు లేఖరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.


