నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి 173 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అన్ని పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, సేవలు పొందిన అనంతరం కోడ్‌ను స్కాన్ చేసి అభిప్రాయం నమోదు చేయాలని కోరారు. ప్రజలు సంతృప్తి చెందేలా సేవలు అందించాలని ఆదేశించారు. జేసీ సంజనా సింహ రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలు స్వీకరించారు. డీఆర్‌ఓ అద్దెయ్య, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నాకు 83 సెంట్ల భూమి ఉంది. గత ప్రభుత్వంలో నా ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడేవి. ఇటీవల అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం ఆపేశారు. కారణాలు తెలియరాలేదు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
–వీరదాసు ఆనందం,
గుమ్మనంపాడు, బొల్లాపల్లి మండలం


