చిలకలూరిపేటలో ఆటో బోల్తా | - | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేటలో ఆటో బోల్తా

Jul 20 2026 1:32 AM | Updated on Jul 20 2026 1:32 AM

చిలకలూరిపేటలో ఆటో బోల్తా హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ వ్యవసాయ డిప్లొమా కోర్సులకు రెండో విడత వెబ్‌ ఆప్షన్లు తిరుపతమ్మ సన్నిధిలో భక్తజన సందడి పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడం, పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జామునుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం చుట్టూ అమ్మవారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ లీలాకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు మధ్యాహ్నం వేళ మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో వాహనాల రద్దీ కొనసాగింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మోపిదేవి: వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 8,77,819 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఏపీ మాజీ సైనిక సంఘాల జేఏసీ ఏర్పాటు

ఐదుగురికి గాయాలు

చిలకలూరిపేటటౌన్‌: పట్టణంలోని పురుషోత్తమపట్నం వినాయక గుడి వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ముందు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో, వెనుక వస్తున్న ఆటో ఢీకొని బోల్తా పడింది. ఆటో డ్రైవర్‌ వేముల కోటేశ్వరరావుతోపాటు ప్రయాణికులు తోక చెంచు, నాగేంద్రం, మేడికొండి చంద్ర, పలపర్తి మేరీ, పలేపు వెంకాయమ్మలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నాగేంద్రంను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.బాధితులంతా ఆదివారం ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తెనాలిరూరల్‌: హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టణ నాజరుపేటలో ఈ నెల 15వ తేదీ పొద్దుపోయాక కొల్లిపర కోటేశ్వరరావును అని తల్లిదండ్రులు భాస్కరరావు, బుల్లెమ్మ, తమ్ముడు మరియదాసు దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య జరిగిన నేపథ్యం, దారి తీసిన ఘటనలు వంటి వివరాలను సోమవారం నిర్వహించనున్న విలేకర్ల సమావేశంలో అధికారులు వెల్లడించనున్నారు.

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు గతంలో ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 21, 22వ తేదీలలో రెండవ విడత వెబ్‌ ఆప్షన్‌లను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్‌ డాక్టర్‌ ఎ.మణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

మాజీ సైనికుడు గోవిందరావు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీ మాజీ సైనిక సంఘాల జేఏసీ ఏర్పాటైంది. ఆదివారం గవర్నర్‌పేటలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో మాజీ సైనిక సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. మాజీ సైనికుడు గోవిందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ శాఖలతో సమన్వయం, పెండింగ్‌ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. మాజీ సైనికులకు ఎలాంటి సమస్య ఎదురైనా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం చూపడానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ మాజీ సైనిక హక్కుల పోరాట సమితి, ఏపీఎక్స్‌–సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, ఏపీఆర్‌ఎంఎస్‌ఎస్‌ఎస్‌, ఎన్‌ ఎక్స్‌ సీసీ, ఏబీపీఎస్‌ఎస్‌పీ, ఏఐఈఎస్‌ఎల్‌ఎస్‌, ఎక్స్‌ సైలర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ నేవీ, రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి మాజీ సైనిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement