రోప్‌వేపై హోప్స్‌ ఏవీ? | - | Sakshi
Sakshi News home page

రోప్‌వేపై హోప్స్‌ ఏవీ?

Jul 17 2026 3:10 AM | Updated on Jul 17 2026 3:10 AM

రోప్‌వేపై హోప్స్‌ ఏవీ?

కోటప్పకొండను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఇందులో భాగంగా రోప్‌వేను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు 2016లో ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారు. కోటప్పకొండ దిగువున నల్లచెరువు నుంచి కొండ పైకి యాత్రికులు చేరుకునే విధంగా రోప్‌వేను నిర్మించే పనులకు 2016లో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పీపీపీ పద్ధతిలో పలు సంస్థలు రోప్‌వే ఏర్పాటుకు ముందుకు వచ్చినా టీడీపీ నాయకుల కమీషన్‌లకు భయపడి ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిపి వెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి సీఎం హోదాలో నరసరావుపేటలో చంద్రబాబు పర్యటించనున్నారు. రోప్‌వే నిర్మాణంపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ ఏడాది జనవరి 22 పర్యటిస్తూ కోటప్పకొండ గిరిప్రదక్షిణ రోడ్డు మంజూరు చేసినట్టు ప్రకటించారు. ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు ఆ పనులు పట్టాలెక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement