ఆర్మూర్‌ ఏఎంసీ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌ ఏఎంసీ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు

Sep 23 2026 1:25 AM | Updated on Sep 23 2026 1:25 AM

ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి

ఆర్మూర్‌: పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఏఎంసీ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల ని ర్మాణానికి అనువైన స్థలాన్ని ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అ భిజ్ఞాన్‌ మాల్వియా, వ్యవసాయ శాఖ అధికారుల తో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్‌ ఏఎంసీ కార్యాలయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాయిబాబాగౌడ్‌, డైరెక్టర్లు, అధికారులతో కలిసి భవన నిర్మాణాలపై మంగళవారం చర్చించారు. మున్సిపాలిటీ భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మా ర్కెట్‌ యార్డులోని 11 ఎకరాల స్థలం నుంచి మూ డు ఎకరాల స్థలంలో మున్సిపల్‌ కార్యాలయ భవనాన్ని ఉత్తర దిశగా నిర్మించాలని అధికారులకు సూ చించారు. మూడు ఎకరాల స్థలాన్ని సేకరించి భవ న నిర్మాణంలో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా పొందుపరచాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు స్థల పరిశీలన..

ఆర్మూర్‌ శివారులోని పిప్రి రోడ్డు వద్ద గల ప్రభుత్వ స్థలంలో ఏఎంసీ నిర్మాణం కోసం అధికారులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో మార్కెట్‌ కమిటీని నిర్మించడం వల్ల ధాన్యం లారీలు రావడానికి, క్రయవిక్రయాలు చేయడానికి రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి అనుమతి పొందామన్నారు. అధికారులు గంగు, సత్యనారాయణ, శ్రీహరి రాజు, నాందేవ్‌, శివాజీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement