గణేశ్‌ నిమజ్జనం.. ట్రాఫిక్‌ మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనం.. ట్రాఫిక్‌ మళ్లింపు

Sep 23 2026 1:31 AM | Updated on Sep 23 2026 1:31 AM

24 నుంచి 26వ తేదీ వరకు డైవర్షన్‌

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ డైవర్షన్‌ అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య మంగళవారం తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి శనివారం ఉదయం 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

వాహనాల రాకపోకలు ఇలా..

● హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు మాధవనగర్‌ బైపాస్‌, కంఠేశ్వర్‌ బైపాస్‌, రైల్వే అండర్‌ పాస్‌, ఎన్టీఆర్‌ చౌరస్తా, రైల్వే స్టేషన్‌ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి.

● బోధన్‌ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర వాహనాలు అర్సపల్లి చౌరస్తాలో ఎడమవైపు తిరిగి, బైపాస్‌ గుండా ప్రయాణిస్తూ కొత్త కలెక్టరేట్‌, కంఠేశ్వర్‌ బైపాస్‌, రైల్వే అండర్‌ పాస్‌, ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి బస్టాండ్‌ చేరుకోవాలి. తిరిగి ఇదే దారిలో బోధన్‌ వైపు వెళ్లాలి.

● ఆర్మూర్‌ వైపు నుంచి నిజామాబాద్‌ బస్టాండ్‌, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనాలు కంఠేశ్వర్‌ బైపాస్‌ చౌరస్తాకు చేరుకొని అక్కడి నుండి నేరుగా రైల్వే అండర్‌ పాస్‌, ఎన్టీఆర్‌ ‘టీ’ జంక్షన్‌ వద్ద కుడి వైపునకు తిరిగి, రైల్వే స్టేషన్‌ ముందు నుంచి బస్టాండ్‌ చేరుకోవాలి. ఆర్మూర్‌ వైపు వెళ్లే వాహనాలు ఇదే రూట్‌లో వెళ్లాలి.

● బాన్సువాడ, వర్ని వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు నిజామాబాద్‌ లోని వర్ని చౌరస్తా వరకు చేరుకొని అక్కడి నుంచి కుడి వైపునకు తిరిగి ఆర్‌ఆర్‌ చౌరస్తా గుండా పులాంగ్‌ చౌరస్తా, ఎల్లమ్మగుట్ట చౌరస్తా, కోర్ట్‌ చౌరస్తా, ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్‌ ముందర నుంచి బస్టాండ్‌ చేరుకోవాలి. నిజామాబాద్‌ నుంచి బాన్సువాడ, వర్ని వైపు వెళ్లే వాహనాలు ఇదే రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది.

భారీ వాహనాలకు..

భారీ వాహనాలు ఎట్టి పరిస్థితిలో గురువారం ఉదయం 11 నుంచి శనివారం ఉదయం 11గంటల వరకు నగరంలోకి ప్రవేశం ఉండదు. కంఠేశ్వర్‌ రైల్వే అండర్‌ పాస్‌ ఎత్తు రోడ్డు నుంచి 13 ఫీట్లు ఉన్నందున, ఈ విషయాన్ని గమనించి 13 ఫీట్ల లోపల ఉండే గణపతి విగ్రహాలు మాత్రమే కంఠేశ్వర్‌ రైల్వే అండర్‌ పాస్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా 13 ఫీట్లు మించిన గణపతి విగ్రహాలు శోభాయాత్ర రథము వెళ్లిన తరువాత రైల్వే ఫ్లైఓవర్‌ను ఉపయోగించుకొని వెళ్లాలి.

పలువురి బైండోవర్‌

నిజామాబాద్‌అర్బన్‌: వినాయక నిమజ్జనం శాంతియుత వాతావరణంలో పూ ర్తయ్యేలా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ముందస్తు జా గ్రత్తగా జిల్లా వ్యాప్తంగా 572 మందిని బైండొవర్‌ చేసి నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. శాంతిభద్రతలకు వి ఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి, సంబంధిత మండల రెవెన్యూ అధికారులు ఎదుట హాజరుపరిచి, చట్టపరమైన నిబంధనల ప్రకారం బైండోవర్‌ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిజామాబాద్‌ డివిజన్‌లో 280 మందిని, ఆర్మూర్‌ డివిజన్‌లో 175, బోధన్‌ డివిజన్‌లో 117 మందిని బైండోవర్‌ చేసినట్లు సీపీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement