● సర్వేను సక్రమంగా నిర్వహించాలి
● అధికారులకు సెర్ప్ డైరెక్టర్
గోపాల్‌రెడ్డి ఆదేశం
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): క్షేత్రస్థాయిలో దరఖాస్తులను నిశితంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు మంజూరయ్యేలా సి బ్బంది కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్ధ (సెర్ఫ్) డైరెక్టర్ గోపాల్‌రెడ్డి సూ చించారు. మండలంలోని ధర్మారం(బి), బర్ధిపూర్ గ్రామాలను మంగళవారం ఆయన సందర్శించారు. పింఛన్ దరఖాస్తులపై అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎలా సర్వే చేస్తున్నారని ఆయన స్వయంగా పరిశీలించారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదుపై పలు సూచనలు చేసిన ఆయన సర్వేను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పలువురు దరఖాస్తుదారులతో మాట్లాడారు.
స్కూల్ యూనిఫామ్స్ పరిశీలన
సుద్దపల్లి, ధర్మారం(బి) గ్రామాల్లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల బా లికల పాఠశాలలను సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి సందర్శించారు. విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్స్‌ను పరిశీలించారు. కొలతలు సరిపోయేలా ఉన్నాయా, వదులుగా ఉన్నాయా అని విద్యార్థుల ను అడిగి తెలుసుకున్నారు. దుస్తుల్లో ఏమైనా సమస్యలు ఉంటే పాఠశాలలో ఒక మహిళా టైలర్‌ను అందుబాటులో ఉంచి వాటిని సరిచేసి ఇవ్వాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. ఏపీడీ మధుసూదన్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.


