● నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు
● కాసుల కోసం ప్రైవేట్, కార్పొరేట్
ఆస్పత్రులకు రిఫర్
నిజామాబాద్‌అర్బన్: ప్రాథమిక చికిత్స అందించాల్సిన ప్రైవేట్, రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్లలో చాలా మంది జలగల్లా కమీషన్‌లు పీక్కుతింటున్నారు. అర్హతలు లేకుండా ఎంబీబీఎస్‌లతో సమానంగా వైద్యం చేస్తు న్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీల వ్యవహారం రోజురో జుకూ శృతిమించుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు రోగుల ను రిఫర్ చేస్తూ పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు. దీంతో పెషెంట్‌కు వేసే బిల్లు లో సుమారు 60శాతం వరకు మొత్తాన్ని ప్రాక్టీషనర్లకు చెల్లిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ పలుమార్లు కొరడా ఝుళిపించినా కమీషన్ల దందాకు మాత్రం బ్రేక్ పడడం లేదు. చాలా ఆ స్పత్రులు ప్రాక్టీషనర్లపైనే ఆధారపడి నడుస్తుండడం శోచనీయం.
జిల్లాలో 2800 మంది వరకు ప్రాక్టీషనర్లు ఉన్నారు. భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ బోధన్, బాన్సువాడ, బిచ్కుంద, నందిపేట, నవీపేట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులను జిల్లా కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంలో కొనసాగుతున్న వ్యక్తులు ప్రతిరోజూ ఉదయం 8గంటల కల్లా గ్రామాలకు చేరుకుని ఆర్‌ఎంపీలు, పీఎంపీలను కలుస్తున్నారు. కొత్త పేషెంట్లను పంపించాలని కోరుతూనే పాత పేషెంట్లకు సంబంధించిన కమీషన్‌లను ఠంచన్‌గా అందజేస్తున్నారు. కొందరైతే ఏకంగా అడ్వాన్స్’గా డబ్బులు చెల్లిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముందే డబ్బులు తీసుకున్న ప్రాక్టీషనర్లు చిన్న అనారోగ్య సమస్యతో తమ వద్దకు వచ్చే రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రి ఇటీవల సిరికొండ మండలానికి చెందిన ఓ మహిళ కడుపునొప్పితో రాగా ఆమెకు గర్భసంచి తొలగించి వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉంచి లక్షా 20వేల రూపాయల బిల్లు వేశారు. దీనిపై ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొనగా.. వారు రూ.60 వేలు కట్టించుకుని వదిలేశారు.
దాడులు చేస్తున్నా..
జిల్లాలో వైద్యారోగ్యశాఖ అధికారులు దాడులు చేస్తున్నా తీరు మారడం లేదు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే దాడులు చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు కానీ కొన్నిటిని మాత్రం వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2024లో 18 క్లీనిక్‌లపై, 2025లో 16 క్లీనిక్‌లపై కేసులు నమోదు చేశారు. డిచ్‌పలి్‌ల్ ప్రాంతంలో ఐదు, ఇందల్వాయిలో రెండు, ఆర్మూర్‌లో మూడు చొప్పున ప్రాక్టీషనర్‌ల క్లీనిక్‌లను సీజ్ చేశారు. రెండు నెలల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. జిల్లాలో అనధికారికంగా క్లీనిక్‌లు నిర్వహిస్తు న్న ప్రాక్టిషనర్‌లపై చర్యలు తీసుకోవాలని నివేదికను అందించారు. దీంతో పోలీసులు తొమ్మి ది మంది ప్రాక్టీషనర్‌లపై కేసులు నమోదు చేశారు. వారం రోజుల తర్వాత మళ్లీ యథావిధిగా వైద్య సేవలందించారు. జిల్లా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి ఉండడం గమనార్హం.


