నిజామాబాద్ నగరంలో ఓవైపు బస్ షెల్టర్లు పలుచోట్ల నిరుపయోగంగా ఉంటున్నాయి. మరోవైపు బస్సులు ఆపుతున్న చోట్ల నిలువ నీడ ఉండడం లేదు. అయితే బస్‌షెల్టర్లు నిర్మించిన చోట్ల బస్సులు ఆపకపోవడం వల్లే తాము చౌరస్తాల వద్ద వేచి ఉంటున్నామని ప్రయాణికులు అంటున్నారు. కొన్ని బస్ షెల్టర్లు యాచకులకు అడ్డాలుగా మారగా, మరికొన్నింటిని వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. బస్సులు, ఆటోలు బస్ షెల్టర్ల వద్ద ఆపేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


