సాయం చేయడంలో ముందుండాలి | - | Sakshi
Sakshi News home page

సాయం చేయడంలో ముందుండాలి

Sep 23 2026 1:31 AM | Updated on Sep 23 2026 1:31 AM

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ఆపద సమయంలో ప్రజలకు సహాయం చేయడంలో యువ ఆపదమిత్రులు ముందుండాలని, శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను సమాజ సేవకు ఉపయోగించాలని బెటాయలిన్‌ కమాండెంట్‌ బి సీతారాం, డీఆర్‌డీవో సాయన్న సూచించారు. ఎంపిక చేసిన యువ ఆపదమిత్ర (వైఏఎంఎస్‌)లకు డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఇచ్చిన వారం రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించా రు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన యువ ఆపదమిత్రలకు డీఆర్‌డీవో సాయన్న, కమాండెంట్‌ బి సీతారాం చేతుల మీదుగా మెడల్స్‌, సర్టిఫికెట్లను అందజేశారు. ఫైర్‌ సేఫ్టీ, ఫస్ట్‌ ఎయిడ్‌, బోటింగ్‌, రె స్క్యూ ఆపరేషన్స్‌ తదితర అంశాల్లో ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తి చేసిన యువ ఆపదమిత్రులను అధికారులు అభినందించారు. జిల్లా యూత్‌ ఆఫీసర్‌ బి రమేశ్‌, తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ కే అపర్ణ, బెటాలియన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అనుపమ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు, సిబ్బంది, యువ ఆపదమిత్రలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీలోకి 4500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

వేల్పూర్‌(మెండోరా): తుపాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. రెండు రోజుల కిందటి వరకు 2 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మంగళవారం 4,580 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 46.355 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement