నిజామాబాద్ రూరల్: రైతు రిజిస్ట్రీని సద్వినియోగం చేసుకోవాలని, 1 డిసెంబర్ 2025 నుంచి 13 ఆగస్టు 2026 వరకు పట్టాపాస్‌పుస్తకం జారీ అయిన రైతులు వివరాలను న మోగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అ ధికారి వీరస్వామి సూచించారు. రూరల్ మండలం గుండారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతు రిజిస్ట్రీ న మోదు కార్యక్రమాన్ని నిర్వహించగా, డీఏవో పరిశీలించారు. రైతు రిజిస్ట్రీలో రైతుల వ్యక్తిగ త, భూమి వివరాలు, సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం తదితర సమాచారాన్ని నమోదు చేయడం జరుగుతుందని, వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకుని, ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు.
డిచ్‌పల్లి రైల్వే గేట్ మూసివేత
● ప్రారంభమైన డబ్లింగ్ పనులు
డిచ్‌పల్లి: డబ్లింగ్ పనులు ప్రారంభం కావడంతో డిచ్‌పల్లి – ఘన్‌పూర్ రోడ్డులో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్‌ను రెండు రోజులపాటు మూసి ఉంచనున్నారు. మంగళవారం ఉదయం పనులు ప్రారంభమయ్యాయి. పాత గేటు తొలగించి కొత్తగా రైలు పట్టాలను ఏర్పాటు చేయడానికి పను లు సాగుతున్నాయి. అలాగే కొత్తగా కట్టిన రైల్వేగేట్ క్యాబిన్‌లో సిగ్నలింగ్‌తోపాటు సంబంధిత పనులను ఉదయం నుంచే ప్రారంభించారు. రెండురోజుల అనంతరం కొత్త క్యాబిన్ ద్వారా సేవలందించడానికి ఏర్పా ట్లు సాగుతున్నాయి. అలాగే పాత గేటును తీసివేసి కొత్త గేటును బిగించారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8గంటల వరకు గేటు మూసి ఉంచనున్నారు.
అర్హుల జాబితాను త్వరగా సిద్ధం చేయండి
వేల్పూర్(బాల్కొండ): బాల్కొండలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కోసం అర్హుల పేర్లతో జాబితాను త్వరగా రూపొందించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి, ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ గీత అధికారులను ఆదేశించారు. బాల్కొండ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. స్లాబ్ నిర్మాణ పనులు కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలను ఈనెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, అక్టోబర్ 1వ తేదీ నుంచి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎల్–3 నుంచి ఎల్–1కు బేస్మిట్ లెవల్ పూర్తయిన ఇళ్లకు బిల్లు రాకుండా పెండింగ్‌లో ఉంటే అర్హులైన వారికి ప్రభుత్వం బిల్లు విడుదల చేస్తుందన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో విజయభాస్కర్, హౌసింగ్ డీఈఈ నరసింహ, ఆర్‌అండ్‌బీ డీఈఈ ప్రమీల, ఏఈఈలు నివర్తి, సతీశ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
భవిష్యత్ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు చర్యలు
బోధన్: భవిష్యత్‌లో విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు చర్యలు చేపడుతున్నామని టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచడం పునరుత్పాదక వనరులను ప్రొత్సహించడం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. సాలూర మండలంలోని హున్సా 33/11 సబ్ స్టేషన్‌కు సీఎం కుసుమ్–ఏ పథకం కింద ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను మంగళవారం గ్రిడ్‌కు అనుసంధానం చేసి టెక్నికల్‌గా చార్జ్ చేశారు. టాక్లీలో సౌర విద్యుత్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. డీఈ వెంకటరమణ, మహ్మద్ ముక్తార్, బోధన్ ఏడీఈ నగేశ్‌కుమార్, బాలచందర్, ఏఈ కల్యాణ్, నాయిని కృష్ణ, సోలార్ ప్లాంట్ రైతులు ఉప్పలపాటి సుబ్బారావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సర్పంచ్ శివకుమార్ పటేల్ పాల్గొన్నారు.


