డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని మారంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ దివస్ వారోత్సవాలు మంగళవారం నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయురాలు శేర్ల సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని త మ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు హిందీ భాషలో ఆలపించిన కవితలు, పాటలు, బాలగే యాల అభినయం, ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విభిన్న ప్రదర్శనలతో అలరించిన వారికి ఉపాధ్యాయులు బహుమతులు అందజేసి అభినందించారు.
రికార్డులు అప్‌డేట్‌గా ఉంచాలి
రుద్రూర్: గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని రకాల రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా అందుబాటులో ఉంచాలని మండల పంచాయతీ అధికారి అరవింద్ ఆదేశించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. జీపీ కార్యదర్శి ప్రేమ్‌దాస్ ఉన్నారు.
రేపు పట్టు చేనేత సంఘం మహాజన సభ
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని గోల్‌బంగ్లా వద్ద పట్టు చేనేత సహకార సంఘం 53వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24న మధ్యాహ్నం 2 గంటలకు మహాజన సభ నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు గంగామోహన్ చక్రు తెలిపారు. డైరెక్టర్లు సకాలంలో రావాలని కోరారు.


