రుద్రూర్: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని బోధన్ సీడీపీవో నందిని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన మన అంగన్‌వాడీ– మన బాధ్యత కార్యక్రమానికి సీడీపీవో ముఖ్య అతిధిగా హాజర య్యారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతా లు, చిన్న పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించి, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ’వెల్ బేబీ షో’ను ఏర్పాటు చేశారు. అనంతరం సీడీపీవో మాట్లాడుతూ.. తల్లి, బిడ్డల ఆరోగ్యం పటిష్టంగా ఉండటంలో పోషకాహారం పాత్ర కీలకమని స్పష్టం చేశారు. సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు కొమరవ్వ, ఆసియా, గోపి లక్ష్మీ, స్థానిక వార్డు సభ్యులు వడ్ల అమృత, హెల్త్ సూపర్‌వైజర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.


