రెంజల్: రెంజల్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులు మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అమ్మకు ప్రే మతో ఒక్కొక్కరు పాఠశాల ఆవరణలో ఒక మొక్క ను నాటారు. ప్రతీ రోజు నాటిన మొక్కలకు నీరందించి సంరక్షించాలని ఇంచార్జి ప్రిన్సిపాల్ సబా ఆర్షిన్ సూచించారు.
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ తెలుగు మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థు లు వారి తల్లుల సమక్షంలో 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై బాధ్యతగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు రాజ్ కుమార్, వెంకటరమణాచారి పాల్గొన్నారు.
మాక్లూర్: తల్లిదండ్రుల పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మండలంలోని చిక్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ ఒరికే భూమన్న, ఉప సర్పంచ్ బూరోల్ల సతీష్ ఆధ్వర్యంలో గ్రామంలోని కొన్ని వార్డులలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల పేరుతో మొక్కలు నాటారు. హెచ్‌ఎం రత్నాకర్, వీబీజీరాంజీ అసిస్టెంట్ సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


