బోధన్: విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ ధైర్యం, త్యాగం, సామాజిక మార్పు కోసం సాగించిన ఆయన పోరాట స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేశ్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని బీటీనగర్ జీహెచ్‌ఎస్‌లో పీడీఎస్‌యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి సందర్భంగా అమెరికా ఆధిపత్య ధోరణులు, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. నాగమణి, మౌనిక, ఎండీ ఇర్షాద్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ జయంతి వేడుకల ప్రచారం
నందిపేట్(ఆర్మూర్): భగత్ సింగ్ జయంతి వేడుకలలో భాగంగా మంగళవారం కుద్వాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకల ప్రచారం నిర్వహించారు. కె.గంగాధర్ మాట్లాడుతూ.. స్వాత్రంత్యం కోసం భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్‌దేవ్‌లు ప్రాణాలు వదిలారని కొనియాడారు.


