భార్యతో గొడవ పడొద్దని మందలించిన అన్నను దారుణంగా.. | - | Sakshi
Sakshi News home page

భార్యతో గొడవ పడొద్దని మందలించిన అన్నను దారుణంగా..

Apr 6 2024 1:00 AM | Updated on Apr 6 2024 1:59 PM

- - Sakshi

భార్యతో గొడవ పడొద్దన్నందుకు హత్య

అన్నను గొడ్డలితో నరికిన తమ్ముడు

నిజామాబాద్‌: భార్యతో గొడవ పడొద్దని మందలించిన అన్నను తమ్ముడు గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపిన ఘటన కోటగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పొతంగల్‌లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాత పొతంగల్‌కు చెందిన దిమ్మెల గోవింద్‌ (58), విఠల్‌ అన్నాదమ్ముళ్లు. గోవింద్‌ మండల కేంద్రంలో క్షౌ రశాల నడుపుతూ జీవిస్తున్నాడు. విఠల్‌ తన భార్యతో తరచూ గొడవపడుతుండడంతో అన్న గోవింద్‌ మందిలించేవాడు. ఈ క్రమంలో గోవింద్‌పై విఠల్‌ కక్షపెంచుకున్నాడు.

రోజులాగే గురువారం పనిపూర్తి చేసుకొని రాత్రి ఇంటికి చేరుకున్న గోవింద్‌ను విఠల్‌ గొడ్డలితో నరికి హతమర్చాడు. బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ జయేశ్‌రెడ్డి, ఏఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య విఠల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తనను మందలించినందుకు గోవింద్‌ను విఠల్‌ హతమర్చాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇవి చదవండి: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement