ఒక్కసారిగా చెలరేగిన కత్తిపోట్ల కలకలం! | - | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా చెలరేగిన కత్తిపోట్ల కలకలం!

Feb 11 2024 1:02 AM | Updated on Feb 11 2024 4:58 PM

- - Sakshi

నిజామాబాద్‌: బాల్కొండ మండల కేంద్రంలోని ఓ హోటల్‌లో టీ తాగుతున్న వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కత్తితో శనివారం దాడి చేయడంతో కలకలం రేగింది. ఎస్సై గోపి తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన రఫీక్‌ వన్నెల్‌(బి) చౌరస్తాలోని ఓ హోటల్‌ వద్ద టీ తాగుతుండగా, అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు సయ్యద్‌ సోఫియాన్‌, సయ్యద్‌ రియాన్‌లు పాత కక్షలను మనుసులో అతడిపై కత్తితో దాడి చేశారు.

రఫీక్‌ తప్పించుకోవడానికి యత్నించగా చేతులకు, ఇతర చోట్ల గాయాలయ్యాయి. వీరిని అడ్డుకోవడానికి వెళ్లిన అతారొద్దీన్‌ సైతం గాయపడ్డాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

ఇవి చదవండి: పెళ్లి రోజే.. తీవ్ర విషాదం!

Advertisement
 
Advertisement
Advertisement