బాన్సువాడ రూరల్: బోరు బావుల వద్ద వర్షాకాలం వరినాట్లు ప్రారంభం కావడంతో వ్యవసాయ కూలీలు పనుల్లో బిజీ అయ్యారు. ఉదయం 7 గంటలకే కూలీలు పొలం వద్దకు చేరుకుంటున్నారు. రాత్రి మిగిలిన చద్దన్నమే పరమాన్నంగా భావించి పొలం గెట్లపై తింటూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఒకే వరుసలో కూర్చుని తింటూ కెమెరాకు చిక్కారు. తమకు నాట్లు ప్రారంభమైన నెలరోజులే చేతినిండా పని లభిస్తోందని, మిగిలిన నెలల్లో వ్యవసాయ యాంత్రీకరణ, కలుపు నివారణ మందుల ప్రభావంతో చేద్దామన్నా పనులు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని కూలీలు వాపోయారు.


