నందిపేట్/పెర్కిట్(ఆర్మూర్): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. నందిపేట మండల కేంద్రంలోని పీహెచ్‌సీతోపాటు ఆలూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు, మందుల స్టాక్‌ను పరిశీలించి వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. నందిపేటలోని పద్మశాలి సంఘం హనుమాన్ దేవాలయం వద్ద కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ సర్వేను పర్యవేక్షించారు. ఆమెవెంట మండల మండల వైద్యాధికారి ప్రవీణ్, పీహెచ్‌సీల వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.


