● గంజ్ కమాన్ వద్ద భారీ సెట్టింగ్‌తో ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఇస్కాన్ బృందం
● నిత్యం దర్శించుకుంటున్న నగరవాసులు
నిజామాబాద్ రూరల్: నగరంలో పూరి జగన్నాథుడు కొలువుదీరాడు. గాంధీగంజ్ క్లాక్ టవర్ వద్ద ఇటీవల ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుడి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి, పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం నగరవాసులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తూ, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రివేళల్లో భజన లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. నిత్యం భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు. ఈనెల 10న ఆలయాన్ని ప్రారంభించ గా, 17 వరకు భక్తుల సందర్శనార్థం ఉత్సవాలు కొనసాగున్నాయి. చివరి రోజు మధ్యాహ్నం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు.


