భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2002–03 బ్యాచ్ పదో తతరగతి విద్యార్థులు ఆదివారం ‘ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. గ్రామంలోని ఓ ఫంక్షన్‌హాల్ కార్యక్రమం నిర్వహించగా, ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్క చోట కలుసుకోవడంపై వారంతా హర్షం వ్యక్తం చే శారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ ఆనాటి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. అనంతరం విందువినోదాలతో ఆనందంగా గడిపా రు. ప్రతి ఏడాది ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలని, పాఠశాల అభివృద్ధికి సహాయం చేయాలని తీర్మానించుకున్నారు.


