వర్షాకాలం.. కరెంట్‌తో పైలం | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలం.. కరెంట్‌తో పైలం

Jul 13 2026 1:40 AM | Updated on Jul 13 2026 1:40 AM

బాన్సువాడ: వర్షాకాలం నేపథ్యంలో ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా పెద్ద చెట్లు, కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బాన్సువాడ డీఈ వినోద్‌కుమార్‌ సూచించారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగిపడి కనపించినా, స్తంభాలు ఒరిగినా, ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నా వెంటనే సమీప విద్యుత్‌ అధికారులకు లేక విద్యుత్‌ అత్యవసర సేవల ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 1912తో పాటు వాట్సప్‌ నంబర్‌ 8712481982ను సంప్రదించాలని ఆయన అన్నారు. ప్రతి వినియోగదారుడు తప్పక పాటించాల్సిన భద్రత సూచనలు తెలియజేశారు.

రైతులకు సూచనలు.

● వ్యవసాయ మోటార్లు, ఫుట్‌ వాల్వులు, పైపులు తడిగా ఉన్నప్పుడు తాకరాదు.

● పంపుసెట్లు, స్టార్టర్లు తప్పనిసరిగా సరైన ఎర్తింగ్‌తో ఉండాలి. ఎర్తింగ్‌ మోటార్లు, జీఐ పైపులు, ఫుట్‌ వాల్వులు అత్యంత ప్రమాదకరం.

● విద్యుత్‌ పనులను స్వయంగా చేయకుండా అర్హ త కలిగిన ఎలక్ట్రీషియన్‌ ద్వారా చేయించాలి. వ్యవసాయ మోటార్లకు జాయింట్లు లేని నాణ్యమైన సర్వీసు వైర్లు మాత్రమే వినియోగించాలి.

● ఇంటి వైరింగ్‌కు సరైన ఎర్తింగ్‌ తప్పనిసరి.

● ఐఎస్‌ఐ మార్క్‌ గల నాణ్యమైన ప్లగ్గులు, స్విచ్‌లు ఉపయోగించాలి.

● సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి తడి చేతులతో మాట్లాడొద్దు. ముందుగా చార్జింగ్‌ ఆఫ్‌ చేయాలి.

● పశువులను మేతకు తీసుకెళ్తున్నప్పుడు ట్రాన్స్‌ ఫార్మర్లు, స్తంభాల దగ్గరకు వెళ్లనీయెద్దు.

● ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేర్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఏబీ స్విచ్‌లు ఆపరేట్‌ చేయడం నిషేధం.

● కాలిన తీగలను స్వయంగా సరి చేయకూడదు. ఎవరైనా కరెంట్‌ షాక్‌ తగిలితే వెంటనే చేతులతో తాకవద్దు. కర్ర, లేదా విద్యుత్‌ ప్రసారం కాని వస్తువులతో వేరు చేయాలి.

● ఇనుప కూలర్లు ఆన్‌లో ఉండగా నీళ్లు పోయొద్దు. ప్లాస్టిక్‌ కూలర్లు వాడడం శ్రేయస్సుకరం. తీగల కింద టెంట్లు, జెండా గద్దెలను కట్టరాదు. లైన్ల మధ్య నుంచి ఇనుప నిచ్చెనలు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. దేవుళ్ల విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు లైన్లకు తాకనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సొంతగా విద్యుత్‌ పనులు

చేయడం ప్రమాదకరం

అత్యవసరమైతే 1912 టోల్‌ ఫ్రీ

నంబర్‌కు ఫోన్‌ చేయాలి

బాన్సువాడ ట్రాన్స్‌కో

డీఈ వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement