పెళ్లి రోజే.. తీవ్ర విషాదం! | - | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజే.. తీవ్ర విషాదం!

Feb 11 2024 1:02 AM | Updated on Feb 11 2024 4:16 PM

- - Sakshi

నవ్య (ఫైల్‌)

నిజామాబాద్‌: ఐదు నిమిషాల్లో ఇంటికి చేరి పెళ్లిరోజు వేడుకల్లో పాల్గొనాల్సి ఉండగా మృత్యువు వెంటాడింది. భిక్కనూరులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన జమ్మగౌని పేట స్వామి, నవ్వ(38) దంపతులు పెళ్లి రోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం కూడెళ్లి రాజరాజేశ్వరాలయానికి బైకుపై వెళ్లారు.

స్వామివారిని దర్శించుకుని తిరుగుపయనమయ్యారు. జాతీయరహదారి నుంచి భిక్కనూరు చర్చి ప్రాంతం నుంచి మండల కేంద్రంలోకి వస్తుండగా హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు వీరి బైకును ఢీకొట్టింది. దీంతో నవ్య రోడ్డుపై పడిపోయి అక్కడి కక్కడే మృతి చెందింది. స్వామిగౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండేవారు. నవ్య మరణవార్త తెలియగానే గ్రామస్తులు వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు కంటతడిపెట్టారు.

ఇవి చదవండి: అనుమానాస్పద స్థితిలో ఇంటర్‌ విద్యార్థిని మృతి

Advertisement
 
Advertisement
Advertisement