రైలుకు అడ్డంగా వెళ్లి హంగామా | - | Sakshi
Sakshi News home page

రైలుకు అడ్డంగా వెళ్లి హంగామా

Jun 18 2023 12:32 PM | Updated on Jun 18 2023 12:37 PM

- - Sakshi

రైలుకు అడ్డంగా వెళ్లి ఓ వ్యక్తి హంగామా సృష్టించిన ఘటన కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో

కామారెడ్డి క్రైం: రైలుకు అడ్డంగా వెళ్లి ఓ వ్యక్తి హంగామా సృష్టించిన ఘటన కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన పాపాన్నగారి రఘుపతి అనే వృద్ధుడు గ్రామంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. శనివారం ఉదయం నిర్మాణం విషయంలో సమీప బంధువుల, కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది.

దీంతో మనస్తాపం చెందిన రఘుపతి కామారెడ్డికి వచ్చాడు. ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడే వచ్చి నిలిపిన రైలు ముందుర తచ్చాడుతు కనిపించాడు. రైలు నడిపే లోకో పైలెట్‌, స్థానికులు ఎంతగా వారించిన వినలేదు. 15 నిమిషాల పాటు రైలుకు అడ్డంగా వెళ్తానని మొండి చేశాడు. దీంతో రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతోs ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement