42 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీ నీటి నిల్వ | - | Sakshi
Sakshi News home page

42 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీ నీటి నిల్వ

Aug 11 2026 12:54 AM | Updated on Aug 11 2026 12:54 AM

నిలకడగా నిజాంసాగర్‌.. జపాన్‌ పర్యటనకు పైడి

వేల్పూర్‌(మెండోరా) : శ్రీరాంసాగర్‌ ప్రాజె క్టులోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం సమయానికి 12,604 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా.. ప్ర స్తుతం 1079.10 అడుగుల(42.534 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 462 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో పోతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. సోమవారం సాయంత్రానికి నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.55 అడుగుల (11.949 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాల నుంచి 1,358 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు.

పోచారానికి తగ్గిన ఇన్‌ఫ్లో

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,472 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. 100 క్యూసెక్కుల నీరు పోచారం ప్రధాన కాలువలోకి విడుదలవుతుండగా, 1,372 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లోగా వెళ్తోందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.

ఈవీఎం గోదాము పరిశీలన

బందోబస్తుపై సూచనలు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోదాము ను కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, అదనపు కలెక్టర్‌ వి భుజంగరావు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోదాముకు వెళ్లిన కలెక్టర్‌.. పోలీసు బందో బస్తు, సీల్‌లను పరిశీలించారు. బందోబస్తు పై పలు సూచనలు చేశారు. వారి వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్‌, విజయేందర్‌రెడ్డి, అగ్ని మాపక అధికారి శంకర్‌ ఉన్నారు.

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

నేతృత్వంలోని బృందంలో చోటు

కామారెడ్డి టౌన్‌ : జిల్లాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ పైడి ఎల్లారెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నేతృత్వంలో ఈ నెల 24 నుంచి 28 వరకు జపాన్‌ దేశంలో పర్యటించనున్న ‘ఇండియన్‌ బిజినెస్‌ డెలిగేషన్‌’ బృందంలో ఆయనకు చోటు దక్కింది. ఈ మేరకు భారత పరిశ్రమల సమాఖ్య ఆయనకు అధికారికంగా లేఖను అందించింది. భారత్‌ – జపాన్‌ వాణిజ్య బంధం బలోపేతంలో భాగంగా ఇరుదేశాల మధ్య నూతన పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంపై జపాన్‌ అగ్రగామి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు పైడి ఎల్లారెడ్డి ‘సాక్షి’తో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement