ఓట్ల తొలగింపు!
● ముగిసిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ
● ఈనెల 17 నుంచి అభ్యంతరాల స్వీకరణ
● అక్టోబర్ 15 వరకు పరిష్కారం
● 19న తుది ఓటరు జాబితా
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో సోమవారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 2,11,864 ఓట్లు తొలగిపోనున్నాయి. 1,565 మంది బీఎల్‌వోలు 14,39,734 ఓట్లకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తికి గత నెల 24 చివరి తేదీగా ముందు నిర్ణయించినప్పటికీ.. ఆ తరువాత ఈనెల 3వ తేదీ వరకు, మళ్లీ 10వ తేదీ వరకు పొడిగించారు. ఎన్యుమరేషన్ ఫామ్‌ల పరిశీలన, డిజిటలైజేషన్ పూర్తి కావడంతో ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ మొదటి రోజు నుంచి మొదలుకుని అక్టోబర్ 15వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 19వ తేదీన ప్రకించనున్నారు. నిజామాబాద్ అర్బన్‌లోనే అత్యధిక సంఖ్యలో ఓట్లు తొలగిపోనున్నాయి. అర్బన్‌లో 42,015 మంది అందుబాటులో లేరు. జిల్లా వ్యాప్తంగా 147 ఎన్యుమరేషన్ ఫామ్‌లను బీఎల్‌వోలు పరిశీలించలేదు.
ఇతర ఓటర్ల జాబితాలో చేర్చిన వారి నుంచి అభ్యంతరాలు వస్తే నోటీసులు అందజేసిన తరువాత పరిశీలించి ఓటరు జాబితా నుంచి తొలగింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పూర్తిగా తొలగిపోనున్న ఓట్ల సంఖ్యలో కొద్దిమేర మార్పులు ఉండే అవకాశం ఉంది.
(ఏఐ సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం)
నియోజకవర్గాల వారీగా రద్దు కానున్న ఓట్లు
నియోజకవర్గం మొత్తం మరణించిన అందుబాటులో ఇతర ప్రాంతాలకు డబుల్ ఇతర తొలగనున్న
ఓటర్లు ఓటర్లు లేనివారు వెళ్లిన వారు ఓటర్లు ఓటర్లు ఓట్లు
ఆర్మూర్ 215186 6185 1648 9918 7925 61 25,737
బోధన్ 223152 5397 4593 13003 4821 21 27,835
బాన్సువాడ 196331 3962 843 9881 5156 43 19,885
అర్బన్ 308261 5384 42015 15107 12167 8756 83,429
రూరల్ 264723 6902 1093 14,368 8722 66 31,151
బాల్కొండ 232081 5882 1590 9321 7003 31 23,827
మొత్తం 14,39,734 33,712 51,782 71,598 45,794 8978 2,11,864


