● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
● కామారెడ్డి, తిప్పాపూర్ పీఏసీఎస్‌ల
ప్రమాణస్వీకారం
కామారెడ్డి రూరల్/ భిక్కనూరు : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. సహకార సంఘాలు కేవలం రాజకీయ పదవులు కాకుండా రైతుల సంక్షేమానికి పనిచేసే వేదికలుగా మారాలని ఆకాంక్షించారు. కామారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ గూడెం శ్రీనివాస్‌రెడ్డి, భిక్కనూర్ మండలం తిప్పాపూర్ పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డితోపాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మహమ్మద్ షబ్బీర్‌అలీ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అంటే రైతులు.. రైతులు అంటే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలిచి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. పాలకవర్గాలు సమన్వయంతో పనిచేసి సొసైటీలను మరింత బలోపేతం చేయా లని సూచించారు.
కార్యక్రమాల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలియాస్, జిల్లా సహకార శాఖ అధికారి రాంమోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ మాజీ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్‌రావు, మండల అధ్యక్షులు రాజాగౌడ్, నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, లక్ష్మీ, బాల్‌రాజు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.


