ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

Aug 11 2026 12:54 AM | Updated on Aug 11 2026 12:54 AM

14న తిరంగా ర్యాలీలో పాల్గొనండి

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ పిలుపు

సుభాష్‌నగర్‌: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని బస్టాండ్‌ వద్ద త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతి సంవత్సరం ‘హర్‌ ఘర్‌ తిరంగా‘ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. కేవలం స్వాతంత్య్ర దినోత్సవం ఒక్కరోజు జెండా ఎగురవేయడమే కాకుండా ఇంటిపై నిత్యం రెపరెపలాడాలన్నారు. అలాగే ఈ నెల 14న నిర్వహించే తిరంగా ర్యాలీలో దేశభక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి, జిల్లా ప్రధానకార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ ప్రమోద్‌, మోర్చాల ప్రతినిధులు వంశీగౌడ్‌, మాదాసు స్వామి యాదవ్‌, బొబ్బిలి వేణు, వెల్మ గంగారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement