వడదెబ్బతో విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో విద్యార్థిని మృతి

Jun 1 2023 11:00 AM | Updated on Jun 1 2023 11:25 AM

- - Sakshi

కామారెడ్డి టౌన్‌ : వడదెబ్బ సోకి చికిత్స పొందు తూ 15 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన కా మారెడ్డి జిల్లా కేంద్ర ప్రభు త్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. క్యాసంపల్లి తండాకు చెందిన ఇస్లావత్‌ నాజు–నీలా దంపతుల పెద్ద కూతురు లావణ్యకు వాంతులు, తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుధవారం మధ్యాహ్నం లావణ్య ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు రాజధానికి తీసుకెళ్లాలని చెప్పారు.

ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చి ధర్నాకు దిగారు. సీ ఐ నరేష్‌ వారిని సముదాయించారు. ఆర్‌ఎంవో శ్రీ నివాస్‌ మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. లావణ్యకు మెదడులో రక్తం గడ్డ కట్టిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement