నిర్మల్‌టౌన్: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని, ప్రైవేట్ బీమా సంస్థలకు అప్పగించిన జీవో 12 వెంటనే రద్దు చేయాలని సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్‌న్స్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ భవ న నిర్మాణ కార్మికులు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. నాయకులు బి.రాకేష్, మల్లేశ్, శంకర్ లింగం, రాజేశ్, ప్రదీప్, ప్రశాంత్, నరేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
నేడు వాహనాల వేలం
నిర్మల్‌టౌన్: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకు న్న వాహనాలకు ఈనెల 22న వేలం నిర్వహించనున్నట్లు ఎకై ్సజ్ పోలీసులు సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుఽ దవారం ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణ ఎకై ్సజ్ స్టేషన్‌లో వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలవారు నిర్ణీత డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.


