న్యూస్‌రీల్
● ఆందోళనలో విద్యార్థులు, ప్రజలు
ఒడిసి పడితేనే జలసిరి
ఎల్‌నినో ప్రభావంతో ఈఏడాది ఇప్పటి వరకు ఆ శించిన వర్షాలు కురవలేదు. ఈనేపథ్యంలో రా ష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమం ద్వారా భూగర్భజలాల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది.
కడెం ఎడమ కాలువకు
గేట్ల బిగింపు
కడెం: కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ మరమ్మతుల్లో భాగంగా ప్రాజెక్టు ఎడమ(ప్రధాన) కా లువకు నూతన గేట్లను బిగించారు. రెండు నెల ల క్రితం ట్రాష్ రాక్ నిర్మాణంతో పాటు, కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ పాత గేట్లను తొలగించారు. వాటి స్థానంలో నూతన గేట్లను బిగించినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు.
నిర్మల్: ‘నిర్మల్ జిల్లా బాసరలో ట్రిపుల్‌ఐటీ ఉంది కదా..! ఇంకా జిల్లాకు యూనివర్సిటీ ఎందుకు..! సీఎం ప్రకటించిన విశ్వవిద్యాలయాన్ని పక్క జిల్లాలో ఏర్పాటుచేస్తాం..’ అంటూ అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇటీవల ఓ సమావేశంలో ప్రకటించారు. దీంతో జిల్లాకు ఇక యూనివర్సిటీ లేనట్టేనన్న విషయం స్పష్టమవుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్మల్ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, తాత్కాలికంగా బాసర ట్రిపుల్‌ఐటీలో తరగతులు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఆరునెలల్లో సీన్ మొత్తం మారిపోయినట్లు తెలుస్తోంది. ట్రిపుల్‌ఐటీని సాకుగాచూపి యూనివర్సిటీని పక్కజిల్లాకు తరలించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే జిల్లా నుంచి పీజీ సెంటర్, మహిళ డిగ్రీ కాలేజీ తరలిపోయాయి. జిల్లాకు అడిగిన ఇంజినీరింగ్ కాలేజీని ఆదిలాబాద్‌కు కేటాయించారు. ఇప్పుడు బహిరంగ సభ సాక్షిగా సీఎం ప్రకటించిన వర్సిటీ కూడా వెళ్లిపోనుంది. అయినా.. జిల్లా పాలకులు, అధికారులు, రాజకీయ నేతలూ ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది.
పక్క జిల్లాకు
తరలించేలా..!
సీఎం హామీ అమలుపైనే అధికారపార్టీ ప్ర జాప్రతినిఽధి వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి చూస్తుంటే నిర్మల్‌కు యూనివర్సిటీ వస్తుందా? లేదా? అన్న సందేహం మరింత పెరిగింది. తాజా పరిస్థితులు కూడా సీఎం హామీ ఉట్టిదేనని, ఇక్కడ ప్రకటించిన యూనివర్సిటీ పక్క జిల్లాలో ఏర్పాటు అవుతుందని సదరు ప్రజాప్రతినిధుల మాటల్లో స్పష్టమవుతోంది.
విద్యార్థుల్లో ఆందోళన..
యూనివర్సిటీ ఏర్పాటులో కనీసం అడుగు కూడా ముందుకు పడకపోవడం, అసలు జిల్లాలో ఏర్పాటు చేస్తారా.. అనే విషయంలో అనిశ్చితి నెలకొనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుని నిర్మల్‌లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా ప్రతీ విద్యాసంస్థను కోల్పోతే నిర్మల్ జిల్లా ఉన్నతవిద్యలో ఎప్పటికీ వెనుకబడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో యూనివర్సిటీ కోసం ఆందోళనలతో పాటు అవసరమైతే న్యాయపోరాటం చేస్తామంటున్నారు.
నీటి సంరక్షణ అందరి బాధ్యత
నిర్మల్‌టౌన్: భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జల్ సంచయ్ జన్ భాగీదారి 3.0 కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు కోరారు. వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, నీటి వృథా నివారణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పరిరక్షణ, ప్రతీ ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువత కలిసి ఈ ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేసి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎందుకీ మౌనం..!?
యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యం, తరలింపు వ్యాఖ్యలపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయంలో మౌనం పాటించడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ట్రిపుల్‌ఐటీని సాకుగా..
చదువులమ్మ కొలువైన నిర్మల్ జిల్లాలో ‘జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయం’ ఏర్పాటు చేయాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఈక్రమంలోనే జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి యూనివర్సిటీని ప్రకటించారు. కానీ ఉమ్మడిజిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు మాత్రం బాసరలో ఉన్న ట్రిపుల్‌ఐటీని సాకుగా చూపుతూ జిల్లాలో యూనివర్సిటీ అవసరం లేదన్న వాదన తెరపైకి తెచ్చారు. కానీ.. ఇక్కడ ట్రిపుల్‌ఐటీలో వేలమంది విద్యార్థులు ఉన్నప్పటికీ అందులో నిర్మల్ జిల్లా నుంచి ఎంతమంది ఉంటున్నారో లెక్కతేల్చాలని విద్యావంతులు పేర్కొంటున్నారు. ట్రిపుల్‌ఐటీ కేవలం సాంకేతిక విద్యకు సంబంధించినది మాత్రమేనని, యూనివర్సిటీ అనేది అన్ని ఉన్నతవిద్యలకు కేంద్రమని వివరిస్తున్నారు. చుట్టూ ఉన్న జిల్లాలకూ అందుబాటులో ఉండేలా నిర్మల్ కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


