ఆర్థికసాయం చెక్కు అందజేత | - | Sakshi
Sakshi News home page

ఆర్థికసాయం చెక్కు అందజేత

Jul 23 2026 1:36 AM | Updated on Jul 23 2026 1:36 AM

మామడ: దిమ్మదుర్తి అటవీరేంజ్‌ పరిధిలోని సింగాపూర్‌ బేస్‌ క్యాంపులో పనిచేసిన రెడ్డి కిషన్‌ ఇటీవల మృతి చెందాడు. అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.1.20లక్షల విరాళాలు సేకరించిన బుధవారం నిర్మల్‌ ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి నాగినిబాను ఎక్బాల్‌పూర్‌లో కిషన్‌ భార్య కమలకు చెక్కు అందించారు. ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఎస్వోలు అలేఖ్య, జాఫర్‌, బీట్‌ అధికారులు రాజు, స్వాతి పాల్గొన్నారు.

డిమాండ్లు నెరవేర్చాలి

నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ ఉద్యమకారుల డి మాండ్లు నెరవేర్చాలని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ ఉప్పు కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అమరజ్యోతి స్తూ పం ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన వై ద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టుల సలహా సమావేశంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీలు అ ద్దంకి దయాకర్‌, రాములునాయక్‌కు వినతిపత్రం ఇచ్చారు. నిర్మల్‌ మెడికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు, ల్యాబ్‌, ఎక్స్‌రే, టెక్నీషియన్లు, సి బ్బంది, వైద్యసహాయకులు ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. మెడికల్‌ జేఏసీ జిల్లా ప్రతిని ధులు సంతోష్‌, చక్రపాణి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement